Home సినిమా టాలీవుడ్ ఎన్టీఆర్: నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం హీరో.. డైరెక్టర్ ఎవరంటే?

ఎన్టీఆర్: నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం హీరో.. డైరెక్టర్ ఎవరంటే?

0

నందమూరి కుటుంబానికి చెందిన నాలుగో తరం నటవారసుడిగా, జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ పై యలమంచిలి గీత నిర్మాణం చేస్తున్నారు.

అక్టోబర్ 30న జరిగిన ప్రెస్ మీట్ లో హీరో నందమూరి తారక రామారావు యొక్క ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పొడవాటి జుట్టుతో, దృఢమైన శరీరాకృతితో కనిపించిన తారక రామారావు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నారు. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ ముఖ్య అతిథులుగా హాజరై తమ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కొత్త హీరోపై ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన నాలుగో తరం తారక రామారావుగా తన ప్రమాణం తీసుకుంటున్నాడు. 18 నెలల పాటు వైవీఎస్ చౌదరి వద్ద శిక్షణ పొందినట్టు తెలిపారు. ఎన్టీఆర్ లుక్ స్టైలిష్ గా, యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది.

ఈ కథ 1980ల కాలంలో జరుగుతుంది. తెలుగు భాష, సంస్కృతి, జాతి నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుంది అని మేకర్స్ వెల్లడించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version