Home ఆంధ్రప్రదేశ్ అమరావతి Diwali 2024: దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Diwali 2024: దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

0

దీపావళి పండుగ సమీపించింది, అందరూ పండుగ సంబరాలకు సిద్ధమవుతున్నారు. దీపాల కాంతులు, బాణాసంచా ధ్వనులతో తెలుగు రాష్ట్రాలు మార్మోగిపోనున్నాయి. ఈ సందర్భంగా, ఈ పండుగను సురక్షితంగా జరుపుకోవాలంటే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం, ఎందుకంటే చిన్న తప్పిదం ఈ పండుగను చేదు జ్ఞాపకంగా మార్చే ప్రమాదం ఉంది.

దీపావళి పండుగకు సురక్షితంగా స్వాగతం పలకండి

దేశమంతా దీపావళి సంబరాలకు సిద్ధమవుతోంది. ఇంటి ముంగిట దీపాల కాంతులు వెలుగుతుండగా, బాణాసంచా పేలుళ్లు పల్లెల నుంచి పట్టణాల దాకా సందడిని తీసుకువస్తాయి. దీపావళి అంటే మమకారంగా గుర్తొచ్చేది టపాసులే. చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా చిన్నాపెద్దా అందరూ బాణసంచా కాల్చి ఆనందిస్తారు. అయితే ఈ సంబరాలు విషాదంలో మారకుండా అప్రమత్తంగా ఉండడం మనందరి బాధ్యత. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ టపాసులు కాల్చేటప్పుడు పాటించాల్సిన కొన్ని కీలక భద్రతా సూచనలను అందించింది.


చేయాల్సినవి:

  • కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
  • బాణసంచా కాల్చేటప్పుడు కిటికీలు, తలుపులు మూసివేయండి.
  • చిన్నారులను పర్యవేక్షణలో ఉంచి ఇంట్లోనే నిరోధించండి.
  • టపాసులు కాల్చేటప్పుడు నీటి బకెట్ లేదా ఇసుక సిద్ధంగా ఉంచుకోండి.
  • బాణసంచా ప్యాకెట్లపై ఉన్న సూచనలను జాగ్రత్తగా పాటించండి.
  • పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.
  • రాకెట్లు, ఫ్లవర్ పాట్లు లాంటి క్రాకర్లు బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చండి. గడ్డి పొదలు, ఎండిన పంటల సమీపంలో కాల్చకుండా జాగ్రత్త వహించండి.
  • ప్రమాదవశాత్తూ గాయపడితే చల్లటి నీటితో శుభ్రపరచి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

చేయకూడనివి:

  • బాణసంచాతో ప్రయోగాలు చేయవద్దు.
  • బాణసంచా వెలిగించే సమయంలో ముఖాన్ని దూరంగా ఉంచండి.
  • పేలని టపాసులను మళ్లీ వెలిగించేందుకు ప్రయత్నించవద్దు.
  • విద్యుత్ స్తంభాల దగ్గర టపాసులు కాల్చకండి.
  • ఫ్లవర్ పాట్లు, హ్యాండ్ బాంబులు వంటి క్రాకర్లను చేతులతో పట్టుకోకండి.
  • క్రాకర్లను వెలిగించి బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా విసరద్దు.
  • అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే 101, 112, 100 లేదా 1070 నంబర్లకు కాల్ చేయండి.

ఈ సూచనలను పాటించడం ద్వారా దీపావళి పండుగను సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవచ్చు. సందడి పండుగను సంబరంగా జరుపుకుందాం, కానీ జాగ్రత్తలతోనే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version