Home ఆంధ్రప్రదేశ్ అమరావతి బోరుగడ్డ అనిల్ వివాదాస్పద తీరు మళ్లీ తెరపై.. కోర్టు బయట మీడియాపై రెచ్చిపోయిన అనిల్

బోరుగడ్డ అనిల్ వివాదాస్పద తీరు మళ్లీ తెరపై.. కోర్టు బయట మీడియాపై రెచ్చిపోయిన అనిల్

0

బోరుగడ్డ అనిల్ కుమార్ తన తీరులో మార్పు లేకుండా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో కేసు నమోదైన నేపథ్యంలో, పీటీ వారెంట్ కారణంగా రాజమహేంద్రవరం జైలులోని అనిల్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఇంఛార్జ్ భరణి నవంబరు 5 వరకు రిమాండ్ విధించడంతో, అనిల్‌ను తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కోర్టు బయట వాహనంలోనే అనిల్ మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ముఖ్యాంశాలు:

  • మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలతో అనిల్ ఓవరాక్షన్
  • మీడియాపై కోర్టు సమీపంలోనే దురుసుగా ప్రవర్తన
  • పోలీసుల సమక్షంలో రెచ్చిపోయిన అనిల్

గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి. మాజీ ఎంపీటీసీ గోర సురేష్ శ్రీకాకుళం జిల్లా గార పోలీస్‌స్టేషన్‌లో అనిల్‌పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో అరెస్టు చేయడం జరిగింది. కోర్టు సమీపంలోనే మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ, పలు మీడియా సంస్థలను నడిరోడ్డుపై నిలబెడతానంటూ హెచ్చరించారు. తనను రౌడీషీటర్‌ అని పిలిచేవారి పై చర్యలు తీసుకుంటానని, జాతీయ ఎస్సీ కమిషన్‌ వరకు వెళ్లతానని ఆయన వ్యాఖ్యానించారు.

కోర్టులో ప్రవర్తనపై ప్రజల విస్తుపోయిన భావన

అనిల్ కోర్టులో బిర్యానీ తినాలని కోరడమే కాకుండా, జడ్జికి తన భోజనం విషయంలో కూడా ఫిర్యాదు చేశారు. పోలీసుల మెస్ నుంచి వచ్చిన భోజనంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, రాజకీయ కక్షసాధింపు కారణంగా తనపై కేసులు వేస్తున్నారని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version