Andhra Pradesh Nirudyoga Bruthi 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రకటించిన మరో పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. వేద పండితులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రంలోని 7 ప్రముఖ దేవాలయాల్లో పనిచేస్తున్న 600 మంది అర్హతగల వేద పండితులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది.
ముఖ్యాంశాలు:
- ప్రతి నెలా రూ.3,000 చెల్లింపు: అర్హత గల వేద పండితులకు ప్రతినెలా అకౌంట్‌లోకి నేరుగా రుపాయలు జమ చేయనుంది.
- వేద పండితులకే ప్రత్యేకంగా: ఈ పథకం సింహాచలం, అన్నవరం, ద్వారకతిరుమల, కనకదుర్గ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలంలోని అర్హులకే వర్తిస్తుంది.
ఇతర ముఖ్య నిర్ణయాలు:
కేబినెట్ ఇటీవల ఆలయ పాలక మండలిలో సభ్యుల సంఖ్యను పెంచుతూ, అందులో బ్రాహ్మణ మరియు నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఒక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మునుపటి ప్రభుత్వంలో ఆలయ పాలకవర్గాల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది, కానీ సభ్యుల సంఖ్య పెంపు మాత్రం చేయలేదు. ఇప్పుడు, పెంచిన సభ్యుల్లో ఒకరిని బ్రాహ్మణ, మరొకరిని నాయీ బ్రాహ్మణుల నుంచి ఎంపిక చేయనున్నారు.