కథ:
“అమరన్” మూవీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ముకుంద్ తన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితాన్ని, ప్రేమను ఎలా బ్యాలెన్స్ చేశాడనేది కథాంశం. ఆయన దేశ రక్షణ కోసం చేసిన త్యాగాలపై కూడా దృష్టి పెట్టింది. ఖాజీపత్రి ఆపరేషన్ వంటి కీలక సంఘటనలు కథలో ముఖ్యంగా ఉన్నాయి.
ఇప్పటి వరకు మిలిటరీ అధికారుల జీవితాలను ఆధారంగా తీసుకుని వచ్చిన సినిమాలలో “అమరన్” కూడా ఒకటి. “మేజర్” మూవీలో మనం సందీప్ ఉన్నికృష్ణన్ కథను చూసినట్లే, “అమరన్” లో ముకుంద్ వరదరాజన్ కథ చూడవచ్చు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి ఈమోషనల్ సీన్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించారు, అయితే కొన్ని సన్నివేశాల్లో హీరోయిజాన్ని పెంచినట్లు అనిపిస్తుంది.
శివ కార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్రలో జీవించేశాడు. అతని నటనతో పాటు సాయి పల్లవి ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. రాహుల్ బోస్ మరియు ఇతర నటులు కూడా తమ పాత్రలలో నిలిచారు.
జీ.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనితనం కూడా ప్రశంసలంటింది. కానీ సినిమా కథలో పెద్ద మార్పులు లేకపోవడంతో, కథ తెలుసుకొని చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది.
Times Now Telugu రేటింగ్: “అమరన్” – 3.25/5
Read more: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో విడుదలైన IQOO 13: ధర, స్పెసిఫికేషన్స్
Read also: YS JAGAN vs SHARMILA: జగన్‌ని దూరం చేయడానికి షర్మిలకు కారణమైన విషయాలు