బుల్లితెరపై ఒకప్పుడు సంచలనం సృష్టించిన యాంకర్ ఉదయభాను, అప్పట్లో ఏ ఛానల్ చూసినా ఆమె యాంకరింగ్ కనిపించేది. కాలక్రమేణా కొత్త తరం రావడంతో ఆమె అవకాశాలు తగ్గిపోయినా, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన ప్రత్యేకతను నిరూపించుకుంటూనే ఉంది. అలాగే, సోషల్ మీడియా ద్వారా, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది.
ఇటీవల, తన యూట్యూబ్ ఛానల్‌లో ఉదయభాను ఓ విశేషాన్ని పంచుకుంది. నందమూరి బాలకృష్ణకు తనకు ఉన్న అనుబంధం గురించి చాలా సందర్భాల్లో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణకు మెసేజ్ చేస్తే, ఆయన స్వయంగా అతిథిగా వచ్చి ఆశీర్వదించారని ఉదయభాను ఎంతో గర్వంగా చెబుతూ ఉంటుంది.
తాజాగా, బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి తన కూతుళ్లకు ప్రత్యేక బహుమతి పంపించారని ఉదయభాను వెల్లడించింది.
నారా బ్రాహ్మణి గిఫ్ట్ ఏమిటంటే?
బ్రాహ్మణి తన పిల్లలకు గిఫ్ట్‌గా వయోలిన్ పంపించారని ఉదయభాను తెలిపింది. ఈ బహుమతిని అందజేస్తూ, “ఒక ప్రత్యేక వ్యక్తి మీకు ఈ గిఫ్ట్ పంపించారు. బాలయ్య మామ అంటే ఎవరికీ ఇష్టం?” అని తన కవల పిల్లలను ప్రశ్నించింది. దానికి వారు “మాకిష్టం” అంటూ ఉత్సాహంగా స్పందించారు. తర్వాత, “మీకు ఎంతో ఇష్టమైన వయోలిన్ పంపించారు” అంటూ ఆ వయోలిన్‌ను వారికి అందజేసింది. ఇది చూసి చిన్నారులు ఎంత ఆనందపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ తీపి ఘటనపై ఉదయభాను ఆనందం వ్యక్తం చేస్తూ, బాలయ్య, బ్రాహ్మణి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. “బాలయ్య కూతురు అంటే బాలయ్యే కదా!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కెరీర్ విషయానికొస్తే…
‘హార్లిక్స్ హృదయాంజలి’ షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన ఉదయభాను, ఆ తర్వాత ‘ఒన్స్ మోర్ ప్లీజ్’, ‘డ్యాన్సింగ్ స్టార్స్’, ‘రేలా రె రేలా’, ‘ఢీ’ (1-6 సీజన్లు), ‘సాహసం చేయరా డింభకా’, ‘నువ్వు నేను’ వంటి ఎన్నో ప్రోగ్రామ్స్‌లో తన యాంకరింగ్‌తో అదరగొట్టింది. బుల్లితెర మాత్రమే కాకుండా వెండితెరపై కూడా కొన్ని ప్రాముఖ్యమైన పాత్రలు పోషించింది. ‘లీడర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.
అయితే, 50 ఏళ్ల వయసులో కూడా అదే ఎనర్జీ, అదే అందంతో యాంకరింగ్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఇటీవల నందమూరి ఫ్యామిలీ నిర్వహించిన ఓ ఈవెంట్‌లోనూ యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది.