అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు చోటుచేసుకుంది. ట్రంప్ విజయం తర్వాత ప్రపంచ స్టాక్ మార్కెట్లు, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు పొందాయి, ముఖ్యంగా ఐటీ స్టాక్స్ 4% వరకూ పెరిగాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరగడం. ఇటీవల పతనం అవుతున్న డాలర్ రేటు, ఒక్కసారిగా ఎగబాకి నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.
డాలర్ పెరుగుదలతో రూపాయి విలువ కూడా తగ్గింది. సాధారణంగా డాలర్, బంగారానికి అవినాభావ సంబంధం ఉన్నందున, డాలర్ విలువ పెరిగితే పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లు, బాండ్లలో ఆసక్తి చూపుతారు. ఈ పరిణామాల వల్ల బంగారంపై పెట్టుబడులు తగ్గడం, ధరలు క్షీణించడం జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా పతనమై ఔన్సుకు 2675 డాలర్ల నుండి 2555 డాలర్లకు దిగిరావడం జరిగింది.
భారత మార్కెట్లలో ఈ ప్రభావం గురువారం ఉదయం నుండి కనిపించే అవకాశం ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 73,650 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,350 వద్ద ఉంది. సిల్వర్ ధర కూడా తగ్గడంతో స్పాట్ సిల్వర్ రేటు 32.50 డాలర్ల నుండి 31.40 డాలర్లకు పడిపోయింది.
పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్న కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరల్లో ఈ భారీ తగ్గింపు సంతోషాన్ని కలిగిస్తుంది.
Read more: చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ 2025: ధోని కొనసాగుతాడా?
Read also: మొలకెత్తిన బంగాళదుంపలను వండుతున్నారా? వాటి వినియోగం ప్రమాదకరమని తెలుసా?