తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఒక సంతోషకరమైన వార్తను అందించింది. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే డైట్ మరియు కాస్మొటిక్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు మరియు అనుబంధ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచే విషయంలో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
డైట్ మరియు కాస్మొటిక్ ఛార్జీల పెంపు
3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు డైట్ ఛార్జీలు ప్రస్తుతం రూ.950గా ఉన్నాయి, వాటిని రూ.1330కి పెంచారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఛార్జీలు రూ.1100 నుంచి రూ.1540కి, ఇంటర్ నుంచి పీజీ వరకు డైట్ ఛార్జీలను రూ.1500 నుంచి రూ.2100కి పెంచారు. అంతేకాక, 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలను రూ.55 నుండి రూ.175కి పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కాస్మొటిక్ ఛార్జీలను రూ.75 నుండి రూ.275కి పెంచారు. తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లలో 7,65,700 మంది విద్యార్థులు ఉన్నారు.