తెలుగులో తొలి సినిమాతోనే యువతను మెస్మరైజ్ చేసింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే, ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడంతో రెండో హీరోయిన్‌గా కనిపించాల్సి వచ్చింది.
ఆమె ఇంకెవరో కాదు.. హీరోయిన్ ఆదా శర్మ. తెలుగులో కొన్ని సినిమాలే చేసినా, హాట్ బ్యూటీగా ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. కానీ ఆదా శర్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తెలుగులో తాను కోరుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో, రెండో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో తన ప్రతిభను చూపించింది.
తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ నార్త్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ‘కేరళ స్టోరీ’ సినిమాతో భారీ విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న ఆదా శర్మ, సోషల్ మీడియాలో తన క్రేజీ ఫోటోస్‌తో సందడి చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వైట్ డ్రెస్ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.