Google search engine
Homeటెక్నాలజీగాడ్జెట్స్ఆండ్రాయిడ్ 15 మరియు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో విడుదలైన IQOO 13: ధర,...

ఆండ్రాయిడ్ 15 మరియు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో విడుదలైన IQOO 13: ధర, స్పెసిఫికేషన్స్ మీ కోసం.

చైనాలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ, అక్టోబర్ 30న, తమ కొత్త ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ IQOO 13ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ప్రాసెసర్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 6150 ఎంఏహెచ్ బ్యాటరీ, మరియు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు అందిస్తున్నారు. అందులో ప్రత్యేకంగా 16 జీబీ ర్యామ్ + 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది.

ధరలకు వస్తే, బేస్ వేరియంట్ (12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ధర 3999 చైనీస్ యువాన్లు, ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 47,000. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ధర 4499 చైనీస్ యువాన్లు, అంటే సుమారు రూ. 53,000. అలాగే, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 4299 చైనీస్ యువాన్లు (రూ. 51,000) కాగా, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ధర 4699 చైనీస్ యువాన్లు (రూ. 55,000). 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ ధర 5199 చైనీస్ యువాన్లు, అంటే సుమారు రూ. 61,000.

ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతోందని సమాచారం. IQOO 13 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ చూడండి:

  • 6.82 ఇంచ్ 2K ఓఎల్ఈడీ డిస్‌ప్లే
  • 144 హెడ్‌జ్ రిఫ్రెష్ రేట్
  • 3168 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ప్రాసెసర్
  • ఆరిజిన్ ఓఎస్ 5 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్
  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్
  • వెనుక 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
  • 5G నెట్‌వర్క్ మద్దతు
  • IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టన్స్
  • యూఎస్బీ టైప్-C పోర్ట్
  • 6150 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments