Google search engine
Homeవార్తలుజాతీయ వార్తలుActor Vijay: తొలి సభతోనే హీరో విజయ్‌పై తీవ్ర విమర్శలు.. పార్టీ శ్రేణులకు దళపతి లేఖ.

Actor Vijay: తొలి సభతోనే హీరో విజయ్‌పై తీవ్ర విమర్శలు.. పార్టీ శ్రేణులకు దళపతి లేఖ.

Actor Vijay: తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన హీరో దళపతి విజయ్, ఇటీవల తన తొలి మహానాడును నిర్వహించారు. ఈ సభకు అభిమానులు, జనం, టీవీకే పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ప్రసంగంలో, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం సాధిస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు.

అయితే, విజయ్‌ ప్రసంగంపై తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. విజయ్‌ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు మిగతా పార్టీల నుండి కాపీ పేస్ట్ చేసినవని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో, టీవీకే పార్టీ శ్రేణులకు విజయ్ ఒక లేఖ విడుదల చేసి, తన పార్టీ నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశాడు.

విజయ్, ప్రస్తుతం వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, రానున్న రోజుల్లో ఈ విమర్శలు మరింత తీవ్రమవుతాయని అన్నారు. టీవీకే పార్టీ రాజకీయాల్లో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని తేల్చాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

డీఎంకే, అన్నాడీఎంకే నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో, విజయ్ కార్యకర్తలకు లేఖ రాసి, భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని పిలుపునిచ్చాడు. ప్రజలు టీవీకే పార్టీని గుర్తించేలా మనస్ఫూర్తిగా పని చేద్దామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాడు.

విజయ్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత, ఇటీవల అక్టోబర్ 27న విల్లుపురం జిల్లాలో మొదటి మహానాడు నిర్వహించాడు. ఈ సందర్భంగా, రాజకీయాలలో అడుగుపెట్టడానికి గల కారణాలను, తాను సినిమా ఇండస్ట్రీతో పోలిస్తే రాజకీయాలు మరింత సీరియస్ అన్నాడు. అనుభవం లేకపోయినా భయపడకూడదని స్పష్టం చేశాడు, ప్రజల కోసం తన సినీ కెరీర్ వదిలేసి రానున్నట్లు పేర్కొన్నాడు.

Read more: వెంటనే ‘సార్’, ‘లక్కీ భాస్కర్’! కానీ మన హీరోలకు మాత్రం రొటీన్ రొటీన్

Read also: అమరన్” మూవీ రివ్యూ: శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments